ఉత్తరాంధ్రలో 2 CBG ప్లాంట్ల నిర్మాణం

..భారత్ న్యూస్ అమరావతి..ఉత్తరాంధ్రలో 2 CBG ప్లాంట్ల నిర్మాణం

అమరావతి :

ఏపిలో ఉత్తరాంధ్రలో రెండు కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG) ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విజయనగరం జిల్లా వంగర మండలం అరసాడలో 20TPD (టన్స్ పర్ డే) సామర్థ్యంతో PVS గ్రూప్, శ్రీకాకుళం జిల్లా జి.సగడాం మండలం శాంతవురిటిలో రామ్మోహన్ ఇండస్ట్రీస్ 15TPD సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. అలాగే నంద్యాల జిల్లా అవుకు వద్ద 800MW సామర్థ్యంతో RVR ప్రాజెక్ట్స్ సంస్థ పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టును నిర్మించనుంది.