భారత్ న్యూస్ తిరుపతి….Ammiraju Udaya Shankar.sharma News Editor…అన్నప్రసాద కేంద్రంలో భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించిన భారత మాజీ ఉప రాష్ట్రపతి
🚩తిరుమల, 2025 జూలై 27: భారత మాజీ ఉపరాష్ట్రపతి గౌ|| శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు, టీటీడీ ఛైర్మన్ శ్రీ బీ.ఆర్ నాయుడు తో కలిసి ఆదివారం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు.
🚩ఈ సందర్భంగా ఆయన భక్తులతో ముచ్చటించారు. అన్నప్రసాదాలు రుచికరంగా, శుభ్రంగా ఉన్నాయని భక్తులు ఆయన వద్ద ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన భక్తులకు శ్రీవారి సేవకులు అందిస్తున్న సేవలను కూడా ప్రశంసించారు.
🚩అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీటీడీ అందిస్తున్న అన్నప్రసాదం ఎంతో శుచిగా, రుచిగా ఉందని తెలిపారు. శ్రీవారి సేవకులుగా భక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ సహక్తులకు సేవలందించడం ఆనందదాయకమైన విషయమని తెలియజేశారు.
🚩ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భానుప్రకాశ్ రెడ్డి, అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.👏

ఓం నమో నారాయణాయ
🚩🙏🕉️🛕🕉️🙏🚩