వన దేవతలు శ్రీ సమ్మక్క సారలమ్మ లను దర్శించుకున్న మంత్రి సీతక్క

భారత్ న్యూస్ హైదరాబాద్….వన దేవతలు శ్రీ సమ్మక్క సారలమ్మ లను దర్శించుకున్న మంత్రి సీతక్క

తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలు

2026 మేడారం మహా జాతరకు 150 కోట్లతో శాశ్వత పనులు చేపట్టడం జరుగుతుంది

వన దేవతల ఆశీస్సులు రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలి

కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న పలువురు బిఆర్ఎస్ నాయకులు

కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క గారు

ఈ రోజు తాడ్వాయి మండలం లోని శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి వర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క గారు
అనంతరం తల్లుల ప్రగణనములో రాబోయే 2026 మహా జాతరకు భక్తులకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ
కుంభమేళాను తలపించే ఈ సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు పటిష్టంగా… ప్రణాళికాబద్ధంగా ఉండాలని మంత్రి సీతక్క అన్నారు. జాతరలో తాగునీటి సరఫరా, మరుగుదొడ్ల ఏర్పాటు, విద్యుత్ శాఖ సేవలు, రోడ్ల మరమ్మతులపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక నిధులు కేటాయించిడం జరిగిందని ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది అని ములుగు జిల్లాలో ఈ జాతర జరుగుతుంది. ముఖ్యంగా.. జాతర సమయంలో భక్తులు, వీఐపీలు బస చేయడానికి వీలుగా మేడారంలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని మంత్రి సీతక్క అన్నారు
ఆనంతరం తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామానికి చెందిన పలువురు బి ఆర్ ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ లో చేరిక వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క గారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు