…భారత్ న్యూస్ హైదరాబాద్….బిగ్ బ్రేకింగ్ న్యూస్💥💥
పోటెత్తిన తుంగభద్ర… సుంకేసుల జలాశయానికి భారీ వరద..

కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర నది ప్రవాహం గంట గంటకు పెరుగుతూనే ఉంది. రాజోలి లో ఉన్న సుంకేసుల జలాశయంకు తుంగభద్ర వరద ప్రవాహం పోటెత్తింది. హోస్పేట్ డ్యాం నుండి ఒక లక్ష క్యూసెక్కులకు పైగా వరద నీరు చేరుతుండడంతో అప్రమత్తమైన అధికారులు ముందస్తుగా 70 వేల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేశారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో నది తీరం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ : స్థానిక సంస్థల ఎన్నికలు.. ఏర్పాట్ల ప్రక్రియ వేగవంతం
తెలంగాణ : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం, రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతుండటంతో ఈసీ ఏర్పాట్ల ప్రక్రియను వేగవంతం చేసింది. ఓటర్ల తుది జాబితా తయారీపై దృష్టి సారించింది. పంచాయతీ ఎన్నికల కోసం కొత్త ఓటర్ల జాబితాను రూపొందిస్తున్నారు. ఈసీ ఆదేశాల మేరకు గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని వార్డుల వారీగా ఓటర్ల జాబితాను అధికారులు తయారు చేస్తున్నారు. అటు రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను 2 దశల్లో నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఈసీకి ప్రతిపాదించింది….