మంత్రివర్గంలోకి స్పీకర్ అయ్యన్నపాత్రుడు… లేదా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు..?!

భారత్ న్యూస్ మంగళగిరి…Ammiraju Udaya Shankar.sharma News Editor…మంత్రివర్గంలోకి స్పీకర్ అయ్యన్నపాత్రుడు… లేదా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు..?!

మంత్రివర్గంలోకి స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. లేదా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు..? అనే వార్తలు పొలిటికల్ సెక్టార్ లో హల్ చల్ చేస్తున్నాయి..

ఏపీలో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే వార్తలు జోరుగా ప్రచారంలో ఉన్నాయి.

చంద్రబాబు కేబినెట్‌లో ముగ్గురిపై వేటు వేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

దీంతో, సీనియర్లు తమకు ఈ బెర్తు దక్కుతుందనే ఆశలో కొందరు ఉన్నారు. అయితే, స్పీకర్ అయ్యన్నపాత్రుడిని.. లేదా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజును మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఉన్న మంత్రులెవరూ జగన్‌ను సరిగా కార్నర్ చేయలేకపోతున్నారని, అందుకే అయ్యన్నపాత్రుడిని రంగంలోకి దింపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఇటీవలే ఎన్నికలకు ముందే టీడీపీలోకి స్వ గృహ ప్రవేశం చేసినప్పటికీ జగన్ ను నాడు అదే పార్టీలో రెబల్ ఎంపీ గా ముద్రేసుకొని మరీ “రచ్చ బండ” పేరుతో బాహాటంగా ఉతికి ఆరేసిన సంఘటన నేడు సీఎం చంద్రబాబు మదిలో మెదుల్తోంది..!