ఏటీఎంలో నగదు చోరీ,

…భారత్ న్యూస్ హైదరాబాద్….ఆదిలాబాద్:

ఏటీఎంలో నగదు చోరీ

ఆదిలాబాద్‌ లో చోరీ ఘటన కలకలం రేపింది. మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్ నగర్ కాలనీ ఎస్బిఐ ఎటిఎంలోని నగదును శనివారం తెల్లవారుజామున దుండగులు అపహరించారు.

గ్యాస్ కట్టర్‌తో లాకర్ కట్ చేసి డబ్బులను ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాలకు బ్లాక్ స్ప్రే కొట్టి నగదుతో ఉడాయించారు.

ఘటనా స్థలానికి డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు కర్రె స్వామి, సునీల్ కుమార్ చేరుకొని దర్యాప్తు చేపడుతున్నారు.