ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు షాక్.. 20 వేల ఇళ్లు రద్దు!

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు షాక్.. 20 వేల ఇళ్లు రద్దు!

తెలంగాణ :

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో భాగంగా సుమారు 3 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేశారు.

ప్రస్తుతం ఇవన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిలో కొన్ని ఇళ్ల నిర్మాణం ప్రభుత్వ నియమాల ప్రకారం లేవని అధికారులు ఆ ఇళ్లను రద్దు చేస్తున్నట్లు సమాచారం.

ఇలా ఇప్పటి వరకు రాష్ట్రంలో సుమారు 20 వేల ఇండ్లను రద్దు చేశారని తెలుస్తోంది. దీంతో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు