భారత్ న్యూస్ ఢిల్లీ….ఓటీటీ వేదికల్లో విచ్చలవిడిగా అందుబాటులో ఉంటున్న అభ్యంతరకర కంటెంట్ ను కట్టడి చేసేందుకు కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోంది.
అశ్లీల చిత్రాలను ప్రసారం చేస్తోన్న కొన్ని మాధ్యమాలపై కొరడా ఝుళిపించింది. ఉల్లు, ALTT సహా కొన్ని యాప్ లు, వెబ్సైట్లపై నిషేధం విధించింది. ఈమేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ దీనిపై తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.
