భారత్ న్యూస్ శ్రీకాకుళం….ఏడాది పాలనలో ప్రజల్లో సంతృప్తి
రాష్ట్రాన్ని వైకాపా అప్పుల ఊబిలోకి నెడితే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్దే లక్ష్యంగా పనిచేస్తోందని తెలుగుదేశం నేతలు పేర్కొన్నారు. అవనిగడ్డ మండల పరిధిలోని మేడిలంకలో శుక్రవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నేతలు మాట్లాడుతూ గత ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల ఆదరాభిమానాలను చూరగొందన్నారు. గత వైకాపా పాలనలో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టిందన్నారు.ఇంటింటికీ తిరిగి ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల పనితీరును వివరించారు.ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, కర్రా సుధాకర్, బండే రాఘవ, పర్చూరి దుర్గాప్రసాద్,మండలి రామ్మోహన్ రావు, మెగావత్తు గోపి, బట్టు నరసింహారావు, కమ్మిలి సుబ్రమణ్యం, గరికిపాటి కృష్ణారావు, గోశాల బాలకోటయ్య, బచ్చు రాఘవయ్య, షేక్ బాబావలి,మెరుగు సోమిరెడ్డి,పెనుమాక రాజు, పెనుమాక ప్రసాద్, నాగార్జున, కోటేశ్వరరావు, సత్యనారాయణ, పీత వెంకటేశ్వరరావు మోపిదేవి నారాయణ, కారుమూరి సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
