డ్వాక్రా మహిళలకు 80% రాయితీతో డ్రోన్లు

భారత్ న్యూస్ రాజమండ్రి….Ammiraju Udaya Shankar.sharma News Editor…డ్వాక్రా మహిళలకు 80% రాయితీతో డ్రోన్లు

ఆంధ్రప్రదేశ్ :

డ్వాక్రా మహిళలకు 80 శాతం రాయితీతో డ్రోన్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించనున్నాయి.

ఈ ఏడాది 440 మంది మహిళలకు డ్రోన్లు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

డ్రోన్ ధర రూ.10 లక్షలు ఉండగా.. రూ.8 లక్షలు రాయితీ లభిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో 88 మంది లబ్ధిదారులను సెర్ప్ అధికారులు గుర్తించారు.

మిగిలిన వారిని ఈ నెలాఖరులోగా ఎంపిక చేయనున్నారు. త్వరలోనే లబ్ధిదారులకు డ్రోన్లు అందిస్తారు