కేంద్రం వద్దకు బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ముసాయిదా..

భారత్ న్యూస్ ఢిల్లీ…..కేంద్రం వద్దకు బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ముసాయిదా..

కేంద్ర హోం శాఖ న్యాయ సలహా కోరిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచేందుకు వీలుగా పీఆర్ చట్ట సవరణకు సర్కార్ ఆర్డినెన్స్

పంచాయతీరాజ్ చట్టం-2018ని సవరించడంలో భాగంగా ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా ఆర్డినెన్స్

ప్రత్యేక పరిస్థితుల్లో 50 శాతం పైగా రిజర్వేషన్లు పెంపుకు రాష్ట్రానికి హక్కు ఉందంటున్న ప్రభుత్వం

అడ్వకేట్ జనరల్, న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం ఆర్డినెన్స్ ను కేంద్ర హోం శాఖకు పంపుతూ గవర్నర్ నిర్ణయం

దీంతో బీసీ రిజర్వేషన్స్ ఆర్డినెన్స్ ఆమోదానికి మరింత ఆలస్యం

మరోవైపు హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక ఎన్నికలు సెప్టెంబర్ 30లోగా పూర్తి చేయాల్సి ఉంది

రిజర్వేషన్ల అంశం ఓ కొలిక్కి వచ్చాకే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్న ప్రభుత్వం