భారత్ న్యూస్ శ్రీకాకుళం.రష్యాలో ఘోర విమాన ప్రమాదం.. 49 మంది మృతి
రష్యాలో అంగారా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం కూలిపోయింది. ప్రయాణికులతో వెళుతున్న విమానం కూలిపోవడంతో ఇందులో ప్రయాణిస్తున్న నలభై తొమిది మంది మృతి చెందినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రయాణికులతో వెళుతున్న అంగారా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం అమూర్ ప్రాంతంలో కుప్పకూలిపోయింది. రష్యాకు తూర్పున ఉన్న చైనా సరిహద్దుల్లో విమానం కనిపించకుండా పోయిన కాసేపటికే విమానం కూలిపోయిందని చెబుతున్నారు.
విమానంలో ప్రయాణిస్తున్న సిబ్బంది, ప్రయాణికులు అందరూ మరణించారని చెబుతున్నారు. కొద్దిసేపట్లో విమానం ట్రిండా ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవ్వాల్సిన పరిస్థితుల్లో సాంకేతిక లోపంతో కూలిపోయినట్లు ప్రాధమికంగా నిర్ధారించా యాభై మందిలో 43 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. చైనాకు శివార్లలో ఉన్న అమూర్ ప్రాంతంలోని టిండా ప్రాంతానికి వెళుతున్న అంగారా ఎయిర్ లైన్స్ విమానం గల్లంతు కావడంతో అధికారులు విమానం కోసం గాలించగా కుప్పకూలిందని తెలిసింది. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు..
