భారత్ న్యూస్ గుంటూరు…..Ammiraju Udaya Shankar.sharma News Editor…ఇది కదా మంచి ప్రభుత్వం, సుపరిపాలన అంటే…!
ఇంటింటికీ సుపరిపాలనలో భాగంగా కార్మికశాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ కాజులూరు మండలం, గొల్లపాలెం గ్రామం, తోట కాలనీలో సుందరపల్లి జ్యోతి ఇంటిని సందర్శించారు. భర్త సుందరపల్లి శేషారావు ఆత్మహత్య చేసుకోవడంతో ఇద్దరు ఆడపిల్లలతో, చిన్న గుడిసెలో నివసిస్తున్నామని మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. స్పందించిన మంత్రి రెండు నెలల్లో ఇల్లు కట్టించి ఇస్తానని, అప్పటివరకూ సురక్షితమైన ఇల్లు అద్దెకు తీసుకుంటే తానే అద్దె చెల్లిస్తానని భరోసా ఇచ్చారు. ఆడపిల్లల్లో ఒకరికి ఉద్యోగం వేయిస్తానని మాటిచ్చారు. మంత్రే నేరుగా తమకు ఇంటికి వచ్చి, తమ దుస్థితి చూసి అడగకుండానే వరాలిచ్చారని ఆ కుటుంబం ఆనందం వ్యక్తం చేస్తోంది….
