భారత్ న్యూస్ గుంటూరు…..Ammiraju Udaya Shankar.sharma News Editor…శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది.
🔹జలాశయం రెండు రేడియల్ క్రస్ట్ గేట్లను 10అడుగుల పైకెత్తి స్పిల్‌వే ద్వారా 55,048 క్యూసెక్కులు శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 66,948క్యూసెక్కులను అదనంగా నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు
🔹ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల నుంచి 39,168, సుంకేసుల జలాశయం నుంచి 36,975 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది.
🔹శ్రీశైలం జలాశయం నీటిమట్టం బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి 883.80 అడుగులు ఉండగా.. నీటి నిల్వ 208 టీఎంసీలుగా నమోదైంది.
