కొత్తమాజేరు రోడ్డుకు గండిపడి 24 గంటలు గడిచినా ప్రారంభంకాని రాకపోకలు

భారత్ న్యూస్ రాజమండ్రి….Ammiraju Udaya Shankar.sharma News Editor…కొత్తమాజేరు రోడ్డుకు గండిపడి 24 గంటలు గడిచినా ప్రారంభంకాని రాకపోకలు

చల్లవల్లి:
మండల వరిధిలోని కొత్తమాజేరు వంతెన వద్ద రోడ్డుకు గండిపడి 24 గంటలు గడిచినా ఇప్పటివరకు గండిని పూడ్చే పనులు అధికారులు చేపట్టలేదు. ఈనెల 22వ తేదీ సాయంత్రం కొత్తమాజేరు వంతెన వద్ద రోడ్డుమార్గం గుండేరు డ్రెయిన్ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి పెద్ద గండి పడింది. దీంతో తాడిచెట్లు రోడ్డుకు అడ్డంగా వేసి ఆ మార్గంలో రాకపోకలు నిలుపుదల చేశారు. రాత్రి ఆర్అండ్బి అధికారులు వచ్చి గండిని పరిశీలించారు. బుధవారం ఉదయమే మెటీరియల్ తెప్పించి గండిని పూడ్చి రాకపోకలు వునరుద్దరిస్తామని చెప్పారు. కానీ బుధవారం సాయంత్రం వరకూ రోడ్డుకు వడిన గండి కాదుకదా అక్కడున్న చిన్నపాటి గుంట కూడా వూడ్చలేదు. దీంతో పరిసర గ్రామాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. భోగిరెడ్డిపల్లి – మంగళాపురం రోడ్డు పూర్తిగా గుంటలు పడి అధ్వానంగా బురద కయ్యగా మారడంతో ద్విచక్ర వాహనాలు ఇరుక్కుపోతున్నాయి. అటు వెళ్లలేక బోగిరెడ్డిపల్లి, చిన్నపురం, గుండుపాలెం మీదగా రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో సమయము, శ్రమ, డబ్బు వృధా అవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ పిల్లలు చదువుకునేందుకు వెళ్లాలంటే నానాపాట్లు పడుతున్నారని వాపోతున్నారు. వెంటనే రోడ్డుపై పడిన గండిన పూడ్చి కొత్త మాజేరు పరిసర గ్రామాలకు రాకపోకలు పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు