HCL పగ్గాలు చేపట్టిన రోషిణి నాడార్ 2017 నుంచి ప్రపంచంలో అత్యంత

భారత్ న్యూస్ విశాఖపట్నం..HCL పగ్గాలు చేపట్టిన రోషిణి నాడార్ 2017 నుంచి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల్లో ఒకరు. ప్రస్తుతం భారతదేశంలో అత్యంత మహిళా ధనవంతురాలు ఆమే. భారతదేశ చరిత్ర లో ఒక మహిళ, ఒక ఐటీ కంపనీ పగ్గాలు చేపట్టి చైర్మన్ అవ్వటం ఇదే తొలిసారి. HCL (హిందూస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్) ని స్థాపించిన శివ నాడార్ ఏకైక కుమార్తె రోషిణి, తండ్రి చాటు బిడ్డ. ఎక్కడికి వెళ్ళినా తండ్రితోనే వెళ్తుంది. తండ్రి మాట జవ దాటదు కానీ తానే స్వతహాగా విద్యాగ్యాన్ అనే సంస్థని స్థాపించింది. చాలా మంది వేరే వాళ్ళకి సహాయం చేసి ఫోటోలు దిగుతారు. ఈమె మాత్రం తాను సహాయం చేసిన వాళ్ళు నాయకులు గా ఎదగాలి, పెద్ద పెద్ద సంస్థల్లో లీడర్లు గా ఎదగాలి, భారతదేశాన్ని నడిపించాలి, అప్పుడు తాను వెళ్ళి వాళ్ళతో ఫోటోస్ దిగాలి అంటుంది. రోషిణి నాడార్ గంట సేపు మాట్లాడితే 40 నిమిషాలు వేరే వాళ్ళు బాగుపడాలి, పల్లెటూర్లు బాగుపడాలి అంటుంది. ప్రధానం గా పాఠశాల విద్య అత్యంత ముఖ్యం అంటుంది రోషిణి. పల్లెటూర్ల నుంచి కొన్ని వందల మంది విద్యార్ధులని సెలక్ట్ చేసి వాళ్ళని గొప్ప వాళ్ళగా తీర్చిదిద్దటమే ఆమె పనుల్లో ఒకటి, అదే ఆమె స్థాపించిన విద్యాగ్యాన్ లక్ష్యం. అందరిలాగా ఆడ మగ సమానత్వం పై మాత్రమే మాట్లాడదు, అన్ని విషయాల్లో డైవర్శిటీ ఉండాలి, పల్లెటూరి వాళ్ళు కూడా నాయకులుగా ఎదిగి అన్ని చోట్లా వాళ్ళు అన్ని స్థానాల్లో ఉండాలి అంటుంది రోషిణి. 1976 లో HCL ని స్థాపించిన శివ నాడార్ ది కూడా విలక్షణ వ్యక్తిత్వం. తమిళనాడు లోని తుత్తుకూడి జిల్లాలోని తిరుచందూర్ దగ్గర్లోని మూలైపోజి అనే పల్లెటూర్లో పుట్టిన శివనాడార్ చదువు అంతా సామాన్యమైన పాఠశాల, కాలేజ్ లే. చదువు అయ్యాక ఇంజినీర్ గా ఉద్యోగం చేస్తూ స్నేహితులతో కలిసి HCL ని స్థాపించాడు. కంప్యూటర్స్ అంటే మన దేశం లో చాలా మందికి తెలియని కాలం లో వాటి హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ ఉత్పత్తులకోసం హిందూస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ (HCL) ని 1976 లోనే స్థాపించాడు. ఇప్పుడు HCL భారతదేశం లో TCS, Infosys తర్వాత మూడో అతి పెద్ద ఐటీ కంపనీ, లక్షా 50 వేల మంది ఉద్యోగులు ఉన్నారు.