భారత్ న్యూస్ గుంటూరు…..ఏపీలో మరో లులు మాల్ – 5 ఎకరాల స్థలం కేటాయించనున్న ప్రభుత్వం!
విజయవాడకి రానున్న లులు మాల్ – ఆర్టీసీ డిపో స్థలాన్ని కేటాయించనున్న ప్రభుత్వం – ఆర్టీసీకి ప్రత్యామ్నాయ భూమి
విజయవాడలో లులు మాల్ ఏర్పాటు కానుంది. పండిట్ నెహ్రూ బస్టాండ్‌కు సమీపంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ జంక్షన్ వద్ద ఉన్న గవర్నర్‌పేట-2 ఆర్టీసీ డిపో స్థలాన్ని ప్రభుత్వం లులు గ్రూప్‌ను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. లులు గ్రూప్ సంస్థ విశాఖపట్నం, విజయవాడల్లో మాల్స్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు చోట్లా కలిపి 1,222 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడంతోపాటు 1,500 మందికి ఉపాధి కల్పిస్తామని స్పష్టం చేసింది. దీంతో విజయవాడలో లులు సంస్థ మాల్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన భూమి కేటాయింపుపై ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (APIIC) పరిశీలన చేసింది.
చివరకు గవర్నర్‌పేట-2 ఆర్టీసీ డిపో ఉన్న స్థలాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా డిపో స్థలాన్ని తమకు ఇవ్వాలంటూ ఏపీఐఐసీ ఎండీ అభిషిక్త్ కిశోర్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు ఇటీవల లేఖ రాశారు. ప్రస్తుతానికి దీనిపై ఏ నిర్ణయం తీసుకోవాలనే
