ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. ఆరుగురు మావోయిస్టులు మృతి

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. ఆరుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌ నారాయణ్‌పూర్‌ జిల్లాలోని అబూజ్‌మడ్‌ అడవుల్లో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. సంఘటన ప్రాంతం నుంచి ఏకే 47, ఎస్‌ఎల్‌ఆర్‌ రైఫిల్‌ సహా పలు ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.