శ్రీశైలంలో శ్రావణమాసోత్సవాల సందర్భంగా స్పర్శ దర్శనం రద్దు, పలు కీలక

భారత్ న్యూస్ విశాఖపట్నం..శ్రీశైలంలో శ్రావణమాసోత్సవాల సందర్భంగా స్పర్శ దర్శనం రద్దు, పలు కీలక మార్పులు…

శ్రీశైలం దేవస్థానంలో ఈ నెల జులై 25 నుండి ఆగస్టు 24 వరకు శ్రావణ మాసోత్సవాలు నిర్వహించనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా మొత్తం 16 రోజులు గర్భాలయ, సామూహిక అభిషేకాలను ఆలయ అధికారులు నిలిపివేశారు. ఆగస్టు 15 నుండి 18 వరకు స్పర్శ దర్శనం నిలుపుదల చేసి, అలంకార దర్శనానికి మాత్రమే భక్తులకు అనుమతి ఇచ్చారు. శ్రావణ శని, ఆది, సోమ, పర్వదినాల్లోనూ అభిషేకాలు నిలుపుదల చేశారు.