భారత్ న్యూస్ రాజమండ్రి….S.V రంగారావు గారు…
తెలుగు చలన చిత్రాన్ని పరిపుష్టం చేసిన మహానటుల్లో అగ్రగణ్యులు శ్రీ ఎస్వీ రంగారావు. చిన్నపాటి ప్రభావశీలమైన హావభావంతోనో, కఠిన సమాసాలతో కూడిన ఎంత పెద్ద సంభాషణనైనా అలవోకగా పలికి మొత్తం సన్నివేశాన్ని రక్తి కట్టించిన ప్రతిభాశీలి ఎస్వీఆర్ గారు.
తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగిన మహానటుడు ఎస్వీ రంగారావు గారికి ఎవరూ సాటిరారనే విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నటుడిగా ఆయన వాచకం, హావభావాలు తెలుగువారినికి ఎంతో ఆనందాన్ని, స్పూర్తిని కలిగిస్తాయి.
విశ్వనట చక్రవర్తి S.V రంగారావు గారి వర్ధంతి సందర్భముగా ఆయనను స్మరించుకుంటూ… ఘన నివాళులు తెలియచేస్తున్నాము.

ఇట్లు
విక్కుర్తి శ్రీనివాసరావు
పారిశ్రామిక వేత్త,
వి.వి.ఆర్ పౌండేషన్ చైర్మన్,
అవనిగడ్డ.