ఉచిత గ్యాస్ సిలిండర్లపై కూటమి సర్కార్ కీలక నిర్ణయం

భారత్ న్యూస్ గుంటూరు…..ఉచిత గ్యాస్ సిలిండర్లపై కూటమి సర్కార్ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం 2 పథకంలో కీలక మార్పు చేసింది. ఇకపై లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే చాలు. రాయితీ డబ్బులు ముందుగా ఖాతాల్లో జమ అవుతాయి. ముందుగా డబ్బులు చెల్లించే అవసరం ఇక లేదు. ప్రస్తుతం ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని ఆరు గ్యాస్ ఏజెన్సీల పరిధిలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇది విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది….