భారత్ న్యూస్ విశాఖపట్నం..Ammiraju Udaya Shankar.sharma News Editor…నయా ట్రెండ్… విదేశీ ఉద్యోగాల పేరుతో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు చేసిన విశాఖ పోలీసులు
ఉద్యోగాల పేరుతో దక్షిణాసియా దేశాలకు మానవ అక్రమ రవాణా
22 మంది నిందితులను అరెస్టు చేసిన విశాఖ పోలీసులు
85 మంది అమాయకులను స్వదేశానికి సురక్షితంగా రప్పించామన్న విశాఖ సీపీ
విశాఖ పోలీసులు మానవ అక్రమ రవాణా ముఠా గుట్టు రట్టు చేశారు.
ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతీ యువకులను కాంబోడియా, మయన్మార్, థాయ్‌లాండ్, లావోస్ వంటి దక్షిణాసియా దేశాలకు అక్రమంగా రవాణా చేస్తున్న పలువురిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి విశాఖ సీపీ శంకబ్రత బాగ్చి తెలిపిన వివరాల ప్రకారం.. నిరుద్యోగులను విదేశాలకు అక్రమ రవాణా చేస్తోన్న పలువురిని అరెస్టు చేశామని, వారి చేతుల్లో మోసపోయిన 85 మంది అమాయకులను స్వదేశానికి సురక్షితంగా రప్పించామని తెలిపారు.
కొందరు ఏజెంట్లు డేటా ఎంట్రీ ఉద్యోగం, రూ.లక్షల్లో జీతం అంటూ ఆశ చూపి ఆకర్షణీయమైన ప్రకటనలతో యువతను ఉచ్చులో దింపుతున్నారని, నిరుద్యోగ యువతను నమ్మిస్తూ విదేశాల్లోని చైనా ఆధారిత స్కామ్ కంపెనీల్లో నేరాలు చేయించడానికి తరలిస్తున్నారని చెప్పారు. కొంతమంది ఉద్దేశపూర్వక
