లోయలో పడిన వాహనం 8 మంది దుర్మరణం.!

భారత్ న్యూస్ ఢిల్లీ…..లోయలో పడిన వాహనం 8 మంది దుర్మరణం.!

ఉత్తరాఖండ్‌ ఫిథోరా ఘడ్ జిల్లా కేంద్రానికి 52 కిలోమీటర్ల దూరంలోని సోనీ వంతెన సమీపంలో మంగళవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది,

మంగళవారం సాయంత్రం పిథోరాగఢ్ జిల్లాలోని మూవాని ప్రాంతంలో భండారి గ్రామ వంతెన సమీపంలో యాత్రికులను తీసుకువెళ్తున్న టూరిస్ట్ వాహనం అకస్మాత్తుగా అదుపుతప్పి లోయలోకి పడిపోవడంతో 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

అధికారుల వివరాల ప్రకారం, ఈ టూరిస్ట్ వాహనం మున్సియారి నుండి బోక్తా గ్రామం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వాహనంలో మొత్తం 13 మంది ఉండగా, పర్యటనను ఆనందంగా పూర్తిచేసుకొని ఊరికి తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.

గమ్యస్థానం కేవలం 25 అడుగుల దూరంలోనే ఉండగానే వాహనం లోయలోకి జారిపోవడం హృదయ విదారక ఘటనగా మారింది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నట్టు తెలిసింది.

గాయపడినవారిని వెంటనే స్థానికులు, పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కలసి లోయలోంచి బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల పరిస