భారత్ న్యూస్ శ్రీకాకుళం…..పులిగడ్డ టోల్ ప్లాజా వద్ద మరో రోడ్డు ప్రమాదం.
పాసింజర్ ఆటోను ఢీ కొట్టిన కోడిగుడ్ల ట్రక్ ఆటో.
ఎదురుగా ఎదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీ కొట్టుకోవడంతో ఆరుగురికి గాయాలు ఒకరి పరిస్థితి విషమించటంతో మచిలీపట్నం తరలింపు.
పులిగడ్డ 216 జాతీయ రహదారిలోని చెక్ పోస్ట్ కి ఇరువైపులా పండ్ల దుకాణాలు ఏర్పాటు చేసి వ్యాపారాలు కొనసాగిస్తూ ఉండడంతో వాహనదారులు దుకాణాల వద్ద నిలబడటంతో ఈ ప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు.
ఈ ప్రదేశంలోనే గతంలో జరిగిన ప్రమాదంలో 6 నెలల పసిపాపతో సహా నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువక ముందే అలాంటి మరో ఘటన జరగడం దురదృష్టకరం.
ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదానికి కారణం అవుతున్న సమస్యను గుర్తించి రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు. .
