ఏపీలో 3 రోజులు వర్షాలు,

భారత్ న్యూస్ మంగళగిరి…ఏపీలో 3 రోజులు వర్షాలు

ఆంధ్రప్రదేశ్ :

నేటి నుంచి 3 రోజులపాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

బుధవారం అల్లూరి, మన్యం, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, కడప, శ్రీసత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయంది.