పాస్‌పోర్ట్‌కి, వీసాకి మధ్య తేడా ఏంటో తెలుసా?

భారత్ న్యూస్ విశాఖపట్నం..పాస్‌పోర్ట్‌కి, వీసాకి మధ్య తేడా ఏంటో తెలుసా?

పాస్‌పోర్ట్, వీసా అనేవి అంతర్జాతీయ ప్రయాణానికి కీలకమైన డాక్యుమెంట్లు. పాస్‌పోర్ట్‌ను మీ దేశ ప్రభుత్వం జారీ చేస్తుంది.

ఇది మీ గుర్తింపు, పౌరసత్వాన్ని ధృవీకరిస్తుంది. వీసా అనేది మీరు వెళ్లాలనుకునే దేశం ఇచ్చే అనుమతి.

ఇది టూరిజం, విద్య, ఉద్యోగం వంటి ప్రయోజనాల కోసం అవసరం.

పాస్‌పోర్ట్ లేకుండా వీసా పనిచేయదు, వీసా లేకుండా పాస్‌పోర్ట్ సరిపోదు.

పాస్‌పోర్ట్‌ మీ బయోడేటా ప్రూఫ్ అయితే, వీసా ఆ దేశానికి ఎంట్రీ టికెట్‌ లాంటిదన్నమాట.