భారత్ న్యూస్ రాజమండ్రి….Ammiraju Udaya Shankar.sharma News Editor…బాపట్ల జిల్లా, అద్దంకి పోలీస్ స్టేషన్,
ద్విచక్ర వాహన దొంగతనాలకు పాల్పడుతున్న ఇంజినీరింగ్ విద్యార్థులు
దొంగతనాలకు పాల్పడే 7గురు సభ్యుల దొంగల ముఠాను అరెస్ట్ చేసిన అద్దంకి పోలీసులు
రూ.25,20,000/- విలువ గల 16 బుల్లెట్ ద్విచక్ర వాహనాలు మరియు ఒక స్కూటి స్వాధీనం చేసుకున్న పోలీసులు
ద్విచక్ర వాహన దొంగతనాలకు పాల్పడే ముఠాను అరెస్ట్ చేసి భారీ సంఖ్యలో వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్.
కేసు వివరాలను వెల్లడించిన చీరాల డిఎస్పి ఎమ్.డి.మోయిన్.
బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ ఆదేశాలతో బాపట్ల జిల్లా అద్దంకి పోలీసులు ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడే ముఠాను చాకచక్యంగా అరెస్టు చేసినారు. వారి నుండి 25 లక్షల 20 వేల విలువగల 16 బుల్లెట్ ద్విచక్ర వాహనాలను, 1 స్కూటి ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర వాహనాల దొంగతనం కేసుల వివరాలను మంగళవారం చీరాల డిఎస్పి ఎమ్.డి.మోయిన్ అద్దంకి పోలీస్ స్టేషన్ లో విలేకరులకు వివరించారు.
ముద్దాయిల వివరాలు:
1)పల్ల సాయిరాం, తండ్రి పల్లా వీరాంజనేయులు, వయస్సు 21 సంవత్సరాలు, అద్దంకి
2) నార్లగడ్డ గోవిందరాజు, తండ్రి వెంకటేశ్వర్లు, వయస్సు 21 సంవత్సరాలు, రెంట చింతల మండలము, పల్నాడు జిల్లా.
3) కోడెల పవన్ కుమార్, తండ్రి వెంకటేశ్వర్లు, వయస్సు 21 సంవత్సరాలు, చౌదరిపాలెం గ్రామము, కావాలి మండలం, నెల్లూరు జిల్లా.
4) దీవి వేణుగోపాల్, తండ్రి వెంకటేశ్వర్లు, వయస్సు 21 సంవత్సరాలు, యెడ్లూరిపాడు గ్రామము, జరుగుమల్లి మండలం, ప్రకాశం జిల్లా.
5) రాయపూడి వసంత్ కుమార్, తండ్రి చంద్రరావు, వయస్సు 22 సంవత్సరాలు, ఈస్ట్ వీరాయపాలెం గ్రామము, దర్శి మండలము.
6) జీనేపల్లి నరేంద్ర వర్మ, తండ్రి జ్వాల నరసింహరావు, వయస్సు 21 సంవత్సరాలు, కొత్త పెండ్యాల గ్రామము, కంచికచర్ల మండలము, NTR కృష్ణ జిల్లా.
7) అక్కల వెంకట సాయి రెడ్డి, తండ్రి రామదాసు రెడ్డి, వయస్సు 21 సంవత్సరాలు, ఆలూరు గ్రామము, కొత్తపట్నం మండలం, ప్రకాశం జిల్లా.
బాపట్ల జిల్లా చీరాల సబ్ డివిజన్ అద్దంకి పోలీస్ స్టేషన్ పరిధిలో సింగరకొండ తిరునాళ్ళ లో 99 ఫీట్ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర్లో పెట్టి బుల్లెట్ మోటార్ సైకిల్ దొంగతనానికి గురైనది. మరియు అద్దంకి పట్టణము లో చిన్నగానుగపాలెం, కాకానిపాలెం, దామావారిపాలెం, RTC బస్ స్టాండ్ వద్ద, సింగరకొండ గుడి వద్ద, ఓల్డ్ ఆంధ్ర బంక్ దగ్గర వివిధ ప్రాంతాలలో బుల్లెట్ వాహనాలు దొంగతనమునకు గురికావటం జరిగినది. అంతట బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులను సవాలుగా తీసుకొని చీరాల డిఎస్పి ఎమ్.డి.మోయిన్ ఆధ్వర్యంలో అద్దంకి సిఐ ఎ.సుబ్బరాజు సారధ్యంలో వారి పోలీసు స్టేషన్ సిబ్బంది ఏ.ఎస్.ఐ వసంత రావు, హెడ్ కానిస్టేబుల్ అంకమ్మ రావు, కానిస్టేబుల్ బ్రహ్మయ్య తో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినారు. వారు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను మంగళవారం అరెస్ట్ చేసినారు. ముద్దాయిలు అద్దంకి పోలీసు స్టేషన్ పరిధి లో 9 బుల్లెట్ మోటార్ సైకిళ్ళు, జే.పంగులూరు పోలీసు స్టేషన్ పరిధి లో 1 బుల్లెట్, 1 స్కూటీ, చిలకలూరిపేట పోలీసు స్టేషన్ పరిధి లో 3 బుల్లెట్ మోటార్ సైకిళ్ళు, నరసరావుపేట పోలీసు స్టేషన్ పరిధి లో 1 బుల్లెట్ మోటార్ సైకిల్, మద్దిపాడు పోలీసు స్టేషన్ పరిధి లో 1 బుల్లెట్ మోటార్ సైకిల్, మేదరమెట్ల పోలీసు స్టేషన్ పరిధి లో 1 బుల్లెట్ మోటార్ సైకిల్, మొత్తం 16 బుల్లెట్ ద్విచక్ర వాహనాలు, ఒక స్కూటి ని దొంగిలించారు. ప్రధాన ముద్దాయిగా ఉన్న పల్లా సాయిరాం, అతని తోటి ముద్దాయిలు దొంగిలించి వాటిల్లో కొన్ని వాడుకుంటూ, మిగిలిన వాటిని బ్రహ్మానంద కాలనీ లోని పాడు బడిన బిల్డింగ్ మదుగులో దాచిపెట్టి నారు. ఈ రోజు అద్దంకి వచ్చిదొంగలించిన బుల్లెట్ మోటార్ సైకిల్స్ ను అమ్ముకుందామని తీసుకొని వెళుతుండగా రాబడిన సమాచారం మేరకు ముద్దాయిలను అదుపులోకి తీసుకొని వారి నుండి మొత్తం 16 బుల్లెట్ మోటార్ సైకిల్స్ ను, 1 స్కూటిని సీజ్ చెయ్యడం జరిగింది. మొత్తం 17 ద్విచక్ర వాహనాల విలువ రూ.25, 20,000/- ఉంటుంది.
ముద్దాయిల మీద ఉన్న కేసుల వివరాలు:
1) Cr.No. 186/2025 U/S 303(2) BNS of Narasaraopet Rural PS
2) Cr.No. 53/2025 U/S 303(2) BNS of Addanki PS
3) Cr.No. 125/2025 U/S 303(2) BNS of Addanki PS
4) Cr.No. 122/2025 U/S 303(2) BNS of Addanki PS
5) Cr.No. 123/2025 U/S 303(2) BNS of Addanki PS
6) Cr.No. 216/2025 U/S 303(2) BNS of Chialakaluri pet PS
7) Cr.No. 116/2025 U/S 303(2) BNS of Maddipadu PS
8) Cr.No. 56/2025 U/S 303(2) BNS of Medarametla PS
9) Cr.No. 213/2025 U/S 303(2) BNS of Chilakaluripet PS
10) Cr.No. 127/2025 U/S 303(2) BNS of Addanki PS
11) Cr.No. 124/2025 U/S 303(2) BNS of Addanki PS
12) Cr.No. 128/2025 U/S 303(2) BNS of Addanki PS
13) Cr.No. 121/2025 U/S 303(2) BNS of Addanki PS
14) Cr.No. 126/2025 U/S 303(2) BNS of Addanki PS
15) Cr.No. 214/2025 U/S 303(2) BNS of Chilakaluripet PS
16) Cr.No. 72/2025 U/S 303(2) BNS of J Pangulur PS
17) Cr.No. 73/2025 U/S 303(2) BNS of J Panguluru PS
ముద్దాయిలు నేరం చేసే విధానం:
ముద్దాయిలందరూ ఒంగోలు లో QIS కాలేజీ నందు B. Tech నాల్గవ సంవత్సరం చదువుతూ ఒంగోలు లోని VIP రోడ్ లో, హిందూ శ్మశాన వాటిక దగ్గర్లో రూమ్ తీసుకొని వుంటూ కాలేజీకి వెళ్ళి వస్తూ చెడు వ్యసనాలకు బానిసై సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో, 2025 ఫిబ్రవరి నెల లో ముద్దాయిలు అందరూ మాట్లాడుకుంటూ డబ్బులు బాగా ఇబ్బంది గా ఉంది, సులువగా డబ్బులు సంపాదించే ఏదైనా మార్గం చెప్పమని రెండవ ముద్దాయి గోవింద రాజుని సలహా అడగ్గా, అతడు YouTube లో వెతికి బుల్లెట్ బండ్లు దొంగతనము చేసే విదానము చూసి, అందరికీ చూపించగా, ఆ విధానంలో హాండిల్ లాక్ ఓపెన్ చేసి బుల్లెట్ బండ్లు దొంగతనము చేసినారు. కొన్ని బుల్లెట్ బండ్లను వాడుకుంటూ మిగిలిన బుల్లెట్ బండ్లను అమ్ముకుందామని బ్రహ్మానంద కాలనీ లోని పాడు బడిన బిల్డింగ్ దగ్గర చిల్ల చెట్లలో దాచిపెట్టినారు.
దొంగల ముఠాను సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని అరెస్ట్ చేసి ముద్దాయిల వద్ద నుండి 25 లక్షల 20 వేల విలువగల 17 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన చీరాల డిఎస్పీ, అద్దంకి సీఐ లను, వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.
