భారత్ న్యూస్ ఢిల్లీ…..బీఎస్ఈకి బాంబు బెదిరింపులు
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)కి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఎక్స్ఛేంజ్ టవర్ భవనంలో 4 RDX IED బాంబులను అమర్చామని, మధ్యాహ్నం 3 గంటలకు అవి పేలిపోతాయని దుండగులు ఇ మెయిల్ చేశారు. BSE సిబ్బంది ఫిర్యాదు మేరకు వెంటనే అక్కడికి చేరకున్న పోలీసులు.. క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. నకిలీ బాంబు బెదిరింపులు గుర్తించారు. అయితే, బాంబు బెదిరింపుల మెయిల్ కామ్రేడ్ పినరయి విజయన్ పేరుతో వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
