ఉత్కంఠ రేపుతున్న సర్జికల్ స్ట్రైక్:భారత్ మరోసారి సరిహద్దు దాటిందా

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఉత్కంఠ రేపుతున్న సర్జికల్ స్ట్రైక్:
భారత్ మరోసారి సరిహద్దు దాటిందా

జులై 11 రాత్రి ఏం జరిగింది?

ఎవరూ సూటిగా చెప్పడం లేదు,
కానీ అస్సాంకు చెందిన ఉగ్రవాద సంస్థ ఉల్ఫా (ULFA) చేసిన సంచలన వాదనలు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి.

భారత సైన్యం
మయన్మార్ సరిహద్దు దాటి డ్రోన్లతో సర్జికల్ స్ట్రైక్ చేసిందని ఉల్ఫా ఆరోపిస్తోంది!

ఉగ్రవాదులు చెబుతున్న దాని ప్రకారం,
ఈ దాడుల్లో తమ కీలక కమాండర్లు హతమయ్యారు. అంతేకాదు, నయన్ అస్సాం అంత్యక్రియలు జరుగుతుండగా మరో మిస్సైల్ దాడి జరిగిందని, అందులో తమకు చెందిన మరో ఇద్దరు సీనియర్ కమాండర్లు ప్రాణాలు కోల్పోయారని ఉల్ఫా వెల్లడించింది.

ఇంత పెద్ద ఎత్తున ఉల్ఫా ఆరోపణలు చేస్తున్నా,
భారత్ వైపు నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. భారత సైన్యం ఈ వాదనలను అంగీకరించడమూ లేదు, ఖండించడమూ లేదు.
ఈ మౌనం మరింత మిస్టరీని పెంచుతోంది.

మయన్మార్‌లో ఉల్ఫా స్థావరాలు చాలా కాలంగా చైనా మద్దతుతో నడుస్తున్నాయని మనకు తెలుసు. ఈశాన్య భారతంలో అస్థిరత సృష్టించేందుకు చైనా వీరికి డబ్బు, ఆయుధాలు, శిక్షణ అందిస్తోంది.

పాకిస్థాన్ ద్వారా కశ్మీర్‌లో ఉగ్రవాదులను పంపించే చైనా, ఇప్పుడు మయన్మార్ ద్వారా ఉల్ఫా లాంటి సంస్థలను సజీవంగా ఉంచుతోంది.

గతంలో కూడా ‘ఆపరేషన్ సన్‌రైజ్’ వంటి చర్యలతో భారత్ మయన్మార్‌లోకి చొచ్చుకుపోయి ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది.

ఇప్పుడు మళ్లీ అలాంటి దాడే జరిగి ఉంటే, ఉగ్రవాదులను వారి స్థావరాల్లోనే అంతమొందించడానికి భారత్ వెనుకాడదని మరోసారి నిరూపించినట్టే!

ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ లేదు, ఏ ఉపన్యాసం లేదు – కేవలం ప్రత్యక్ష దాడి!

భారత్ ఈ మౌనం కూడా ఒక బలమైన ప్రకటన- “చేయాల్సింది చేసేసాం, ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు”

ఉల్ఫాకు చెందిన కీలక ఉగ్రవాదులను ఒక్కొక్కరిగా నిర్మూలిస్తున్న తీరును చూస్తే, ఈశాన్య ప్రాంతంలో భారతదేశం ఇకపై ఎటువంటి బాహ్య జోక్యాన్ని సహించబోదని స్పష్టమవుతోంది.

చైనా, పాకిస్తాన్ రెండూ ఒకటి అర్థం చేసుకోవాలి:
ఇది 1962 నాటి భారత్ కాదు!!