భారత్ న్యూస్ గుంటూరు…..ఆంధ్రప్రదేశ్ :
కొత్త రేషన్ కార్డులు.. పేర్ల చేర్పులు, మార్పుల ప్రక్రియ షురూ!
కొత్త రేషన్ కార్డుదారులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొత్తగా ఇవ్వనున్న బియ్యం కార్డులకు అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది.
ఈ మేరకు ప్రభుత్వం మే 7వ తేదీ నుంచి ప్రత్యేక ప్రక్రియ ప్రారంభించింది.
కుటుంబ సభ్యుల విభజన, మృతుల పేర్ల తొలగింపు, చిరునామా మార్పు, కొత్త సభ్యుల చేర్పు వంటి అంశాలకు కూడా ఈ సందర్భంగా అవకాశం కల్పించారు.

అర్హులైన ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.