.భారత్ న్యూస్ హైదరాబాద్….డబ్బు కోసం మైనర్ బాలుడి కిడ్నాప్.. చేదించిన హన్మకొండ పోలీసులు
డబ్బు కోసం మైనర్ బాలుని కిడ్నాప్ కు పాల్పడిన నలుగురు సభ్యుల ముఠాలోని ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు నిందితులను హన్మకొండ పోలీసులు ఆదివారం అరెస్టు చేసి వీరి చెర నుండి బాలుడిని సురక్షితంగా రక్షించారు వీరిలో మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. వీరి నుండి పోలీసులు ఒక ఆటోను, ఒక కత్తి రెండు పెట్రోల్ బాటిళ్లు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు అరెస్టు చేసిన వారిలో 1. పూరి పద్మ W/o బిక్షపత్తి, వయస్సు: 45 సంవత్సరాలు, ఏనుగులగడ్డ, హన్మకొండ, ప్రస్తుతం ఎల్లంతకుంట గ్రామం & మండలం, కరీంనగర్ జిల్లా,
2.పూరి రాజు @ నరేష్ S/o బిక్షపత్తి, వయస్సు: 25 సంవత్సరాలు, ఏనుగులగడ్డ, హన్మకొండ, ప్రస్తుతం చింతిరాల్య కాలనీ, అశ్వాపురం గ్రామం మరియు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
3.జెట్టి జ్యోతి W/o గంగరాజు, వయస్సు: R/o రేగుబెల్లి (v), దమ్మగూడెం(m), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కు చెందిన వారీగా పోలీసులు గుర్తించగా మరో నిండుతుడు శ్రీకాంత్ ప్రస్తుతం పరారీ లో వున్నాడు.
ఈ అరెస్టుకు సంబంధించి హనుమకొండ ఏసీపీ నరసింహారావు వివరాలను వెల్లడిస్తూ పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో ప్రధాన నిందితురాలైన పూరి పద్మ హనుమకొండలో స్థానికంగా నివాసం ఉంటూ బ్రాహ్మణవాడలోని క్యాటరింగ్ నిర్వహించే రమణ అనే వ్యక్తి వద్ద రోజువారి కూలిగా పనిచేసేది. కొన్ని సంవత్సరాలు పాటు నిందితురాలు రమణ వద్ద పనిచేయగా వీరి ఇరువురి మధ్య ఆర్థికపరమైన గొడవలు కారణంగా నిందితురాలు తిరిగి తన స్వగ్రామానికి తిరిగి వెళ్ళిపోయింది. రమణ నుండి నిందితురాలికి డబ్బులు రావాల్సి ఉందని, తన డబ్బులు తనకు తిరిగి రావాలంటే రమణ వద్ద ఉండే అతని దగ్గర బంధువు మైనర్ బాలుడిని కిడ్నాప్ చేయడం ద్వారా తన డబ్బులు తిరిగి వస్తాయని తన కుమారులైన రాజు,శ్రీకాంత్‌ల తో పాటు మరో నిందితురాలు జ్యోతి కి వివరించడంతో, ఈ నలుగురు నిందితులు మైనర్ బాలుడిని కిడ్నాప్ చేసేందుకు పథకం వేసుకున్నారు. ఇందులో భాగంగా ఈ నెల నాలుగవ తారీఖున మైనర్ బాలుడు ద్విచక్ర వాహనంపై బయటకి వచ్చిన క్రమంలో ఈ ముఠా సభ్యులు మైనర్ బాలుడుని నయీమ్ నగర్ ప్రాంతంలో బలవంతంగా ఆటోలో ఎక్కించుకొని ములుగు మార్గం మీదుగా అశ్వాపురం కి చేరుకున్న నిందితులు కిడ్నాప్ గురైన బాలుడితో అతని తల్లికి ఫోన్ చేయించి బాలుడి వరసకు మామ అయిన రమణ నుండి 12 లక్షల రూపాయలు ఇస్తే బాలుడుని విడుదల చేస్తామని బాలుడి ద్వారా రమణ తోపాటు బాలుడు తల్లిని బెదిరించారు. బాలుడ్ని కిడ్నాప్ చేసిన ఈ ముఠా సభ్యులు బాలుడితో కలిసి అశ్వారావుపేట కొత్తగూడెం, కర్కగూడెం తో పాటు మంగపేట ప్రాంతాల్లోని పరిచయస్తుల ఇండ్లలో బాలుని రహస్యంగా ఉంచారు. ఇదే సమయంలో నిందితులు తమ వద్ద ఉన్న కర్రలతో మైనర్ బాలుడిని కొడుతూ పెట్రోల్ పోసి చంపుతామని కత్తితో బెదిరించడం జరిగింది. ఇలా చేస్తున్నా కూడా కిడ్నాప్ కి గురైన బాదితుడి కుటుంబ సభ్యుల నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో డబ్బులు ఇవ్వవలసిన రమణని కూడా కిడ్నాప్ చేస్తే తమ డబ్బులు తిరిగి వస్తాయని అనుకున్న నిందితులు ఈరోజు ఉదయం ములుగు రోడ్డు మీదుగా అవుటర్ రింగ్ రోడ్డు లో ఆటోలో ప్రయాణిస్తుండగా, అదే సమయంలో హన్మకొండ పోలీసులు యాదవనగర్ పెట్రోల్ పుంపు వద్ద రోడ్డు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా చూసి భయపడిన నిందితులు ఆటోని వదిలి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు, పద్మ,జ్యోతి, రాజులను పట్టుకోగా మరో నిందితుడు శ్రీకాంత్ అక్కడి నుంచి తప్పించుకొని పారి పోయాడు. పట్టుబడిన ముగ్గురు నిందితులను పోలీసులను అదుపులో తీసుకొని విచారించగా మైనర్ బాలుడుని కిడ్నాప్ చేసినట్లుగా నిందితులు అంగీకరించారు. దీనితో హనుమకొండ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారని, మైనర్ బాలుడిని రక్షించి అతని తల్లికి అప్పగించడం జరిగిందని ఏసీపి వెల్లడించారు. నిందితులని పట్టుకోవడం లో ప్రతిభ కనబరిచిన హన్మకొండ ఇన్స్పెక్టర్ మచ్చ శివ కుమార్, ఎస్ఐ K. కిషోర్, AAO సల్మాన్ పాషా, కానిస్టేబుల్ V. అశోక్, D. కరుణాకర్, B. సతీష్, వినూష, కారుణ్య, HG రవి మరియు యుగేందర్ లను ACP హన్మకొండ గారూ అభినందించారు
