…భారత్ న్యూస్ హైదరాబాద్….రేపు కొత్తగా 3,54,000 రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం: పొంగులేటి
తెలంగాణ : రాష్ట్రంలో కొత్తగా 3,54,000 రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సోమవారం జులై 14న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో మంత్రి మాట్లాడుతూ.. “BRS ప్రభుత్వం 10 సంవత్సరాలు మాటలతో కాలయాపన చేసింది. 4 విడతల్లో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. ఇందిరమ్మ ప్రభుత్వం 9 రోజుల్లోనే రూ.9వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది.” అని తెలిపారు. ..
