భారత్ న్యూస్ విశాఖపట్నం..Ammiraju Udaya Shankar.sharma News Editor…ఉప్పాడ సముద్రం ఉగ్రరూపం
యు.కొత్తపల్లి(కాకినాడ) : ఆదివారం మధ్యాహ్న సమయం నుంచి ఉప్పాడలో సముద్రపు అలలు తీరంపై విరుచుకుపడుతున్నాయి. ప్రస్తుతం ఎటువంటి అల్పపీడనాలు, తుఫాన్లు హెచ్చరికలు లేకపోయినప్పటికీ సముద్రుడు తన ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. ఆదివారం ఉదయం నాలుగు గంటల నుండి సముద్రం కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతుండడంతో బీచ్ రోడ్డుపై వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారు. కొన్నిచోట్ల బీచ్ రోడ్డు ధ్వంసం అయ్యింది. ఉప్పాడ పంచాయతీ రంగంపేట నుండి ఎస్.పి.జియల్ చివరి వరకు అలల ఉధృతి తీవ్రస్థాయిలో ఉందని అధికారులు తెలిపారు. ఉప్పాడ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న సూరాడపేట,మాయా పట్నం పాత బజారు సమీపల్లో సముద్రం ముందుకు రావడంతో పలువురి మత్స్యకారుల ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఆదివారం కావడంతో పర్యాటలకు తాకిడి ఎక్కువైంది. దీంతో అధికారులు పలు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
