పి.వి.ఎం. నాగజ్యోతి గారికి “గురువందనం అవార్డు” ప్రదానం

.భారత్ న్యూస్ హైదరాబాద్….పి.వి.ఎం. నాగజ్యోతి గారికి “గురువందనం అవార్డు” ప్రదానం

హైదరాబాద్‌లోని ‘తెలంగాణ సారస్వత పరిషత్ – డాక్టర్ దేవులపల్లి రామానుజరావు కళామందిరం లో జూలై 12, 2025న హైదరాబాద్
జరిగిన “గురువందనం అవార్డ్స్ – 2025” కార్యక్రమంలో, మల్టిపుల్ టాలెంటెడ్ టీచర్ పి.వి.ఎం. నాగజ్యోతి గారికి ముఖ్య అతిథి తెలంగాణ తొలి అసెంబ్లీ స్పీకర్ శ్రీ సిరికొండ మధుసూదనాచారి గారి చేతుల మీదుగా “గురువందనం అవార్డు” ను ఘనంగా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని సృజన ఆర్ట్స్ క్రియేషన్స్ సంస్థ గురుపౌర్ణిమ సందర్భంగా నిర్వహిస్తూ, అర్హులైన ఉపాధ్యాయులను గౌరవిస్తోంది.

పి.వి.ఎం. నాగజ్యోతి గారు విద్యారంగంలో అనేక సంవత్సరాలుగా అంకితభావంతో సేవలందిస్తూ, తన బోధనా నైపుణ్యంతో విద్యార్థుల హృదయాలను గెలుచుకున్నారు. ఆమె బోధనలో వినియోగించే వివిధ విద్యా సాంకేతిక పద్ధతులు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా ఉండటం విశేషం.
ఫోనెటిక్స్ బోధన, రోల్ ప్లే, యాక్టివ్ లెర్నింగ్ టెక్నిక్స్, డిజిటల్ టూల్స్ వంటి ఆధునిక బోధనా పద్ధతుల ద్వారా విద్యార్థుల్లో ఆంగ్ల భాష పట్ల ఆసక్తి పెంచుతూ, వారికి ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు. పాఠాలను సృజనాత్మకంగా, స్పష్టంగా బోధిస్తూ విద్యార్థులలో చురుకుతనాన్ని, ఆలోచనా శక్తిని పెంపొందించే విధానం ఆమెకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది.
ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్న నాగజ్యోతి గారు, ఈ పురస్కారంతో తన బోధనా నైపుణ్యం, నిబద్ధతను మరోసారి నిరూపించుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా
శ్రీ సిరికొండ మధుసూదనాచారి (తెలంగాణ అసెంబ్లీ ఫస్ట్ స్పీకర్, ఎమ్మెల్సీ)
శ్రీ ఎస్. వేణుగోపాలచారి (మాజీ కేంద్ర మంత్రి)
శ్రీ రుద్రరాజు పద్మరాజు (మాజీ చీఫ్ విప్, ఏ.పీ.ఎల్.సీ)
శ్రీమతి సముద్రాల శ్రీదేవి (చైర్‌పర్సన్, సముద్రాల ఫౌండేషన్) తదితరులు హాజరై ప్రోత్సాహం అందించారు.

పి.వి.ఎం. నాగజ్యోతి గారికి ఈ అవార్డు లభించడం ఆమెకు మాత్రమే కాకుండా, ఆమె విద్యార్థులు, సహచర ఉపాధ్యాయులు, విద్యాభిమానులకు గర్వకారణంగా నిలిచింది. సమర్థవంతమైన బోధనతో జీవితాలు మార్చగలిగే ఉపాధ్యాయులకు సమాజం ఇస్తున్న గౌరవానికి ఇది ప్రతీకగా నిలిచింది.