మలి విడత భూముల సేకరణ పేరుతో చంద్రబాబు చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారం

భారత్ న్యూస్ గుంటూరు…..Ammiraju Udaya Shankar.sharma News Editor…విజయవాడ :

మలి విడత భూముల సేకరణ పేరుతో చంద్రబాబు చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారం

ముందు 33 వేల ఎకరాల్లో రాజధాని ఎక్కడ ?

ఆలు లేదు..చూలు లేదు..కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఉంది బాబు తీరు

చంద్రబాబు గారు గాల్లో కాదు..మీరు నేలమీద నడవండి

గన్నవరం ఎయిర్పోర్ట్ ఉండగా 5 వేల ఎకరాల్లో ఇప్పుడే మరో ఎయిర్పోర్ట్ ఎందుకు ?

అమరావతికి అంత బిజినెస్ ఉందా.. అంత బిజి…నెస్ ఉందా ?

ATR ఫ్లైట్ లు తప్పా ఒక్క ఇంటర్నేషనల్ ఫ్లైట్ కి దిక్కులేదు

రాజధాని కేంద్రం నిర్మించే ప్రాజెక్ట్..మోడీ గల్లా పట్టి లక్ష కోట్లు తీసుకురండి

రాజధాని పేరుతో అప్పులు చేసి మా నెత్తిన భారం మోపకండి

సెల్ఫ్ ఫైనాన్స్ మనకెందుకు..మోడీ మెడలు వంచి నిధులు తీసుకు రండి

మలి దశ 40 వేల ఎకరాల భూ సేకరణను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది

వైఎస్ షర్మిలా రెడ్డి
APCC చీఫ్

ఇలాంటి పరిస్థితిలో శంషాబాద్ లాంటి ఎయిర్పోర్ కట్టి ఏం చేస్తున్నారు ?

2015 లో మోడీ వచ్చారు

శిలాఫలకం వేసి మట్టి కొట్టి వెళ్ళారు

శంకుస్థాపన చేసి 10 ఏళ్లు దాటింది

మోడీ మల్లి వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్పారు

సేమ్ సీట్ రిపీట్ చేశారు

మోడీ మాటలు వినటానికి,చూడటానికి అసహ్యం గా ఉంది

మోడీ మాటలు నమ్మి చంద్రబాబు రాత్రి పడ్డ గోతిలో పగలు పడ్డారు

మోడిని మళ్ళీ ఎలా నమ్మారో తెలియదు

2015 లో 33 వేల ఎకరాల భూములు సేకరించారు

మరో 20 వేల ఎకరాల భూమి ఉంది అన్నారు

54 వేల ఎకరాల్లో రాజధాని కడతాం అన్నారు

సింగపూర్,జపాన్, అన్నారు

రాజధాని బెస్ట్ లెవెబుల్ సిటీ అన్నారు

10 ఏళ్ల తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే పిచ్చి మొక్కలు తప్పా ఏమి లేదు

29 వేల మంది రైతులు త్యాగాలు చేసి భూములు ఇచ్చారు

వారి త్యాగం ఇంత వరకు ఫలించలేదు.

భూమి లేని కుటుంబాలు దాదాపు 23 వేల మందికి న్యాయం జరగలేదు

ఈ రోజు రాజధాని నిర్మాణం అంచనా 70 వేల కోట్లకు దాటింది

దాదాపు 53 వేల కోట్ల టెండర్లు కూడా పిలిచారు

ఇప్పటికి రాజధాని పేరుతో ఆంధ్రా ప్రజలను భ్రమలో పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

నిజానికి రాజధాని నిర్మాణం కేంద్రం బాధ్యత

కేంద్ర ప్రభుత్వం నిర్మించి ఇవ్వాల్సిన ప్రాజెక్ట్

విభజన హామీల్లో రాజధాని నిర్మాణం ఉంది.

మోడీ సైతం డిల్లీని తలపించే రాజధాని అన్నాడు

కానీ 10 ఏళ్లలో 15 వందల కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు

రాజధాని కి అప్పులు చేయాల్సిన అవసరం లేదు.

ఇప్పటికీ కేంద్రం నిర్మించి ఇవ్వాల్సి ఉంది

రాజధాని పేరుతో అప్పులు ఎందుకు చేస్తున్నారు ?

ప్రపంచ బ్యాంక్ రుణాల ను కేంద్రం తన నెత్తి మీద వేసుకుంటుంది అని అంటుంది

దీని మీద క్లారిటీ లేదు.

రాజధాని కోసం ప్రైవేట్ బ్యాంకుల దగ్గర అప్పులు చేస్తున్నారు

30 వేల కోట్లు ఇప్పటికే అప్పులు తెచ్చారు

మరో 40 వేల కోట్లు రాజధాని పేరుతో అప్పులు చేస్తారట

ఈ అప్పులు ఎందుకు ? చంద్రబాబు సమాధానం చెప్పండి

చంద్రబాబు ఇచ్చిన బలంతో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది

ఇంత బలం చంద్రబాబు దగ్గర పెట్టుకొని అప్పులు ఎందుకు తెస్తున్నారు ?

ఆంధ్రా రాష్ట్ర ప్రజలు ఇచ్చిన బలంతో కేంద్రంలో ప్రభుత్వం నిలబడి ఉంది

మీ బలాన్ని ఉపయోగించి రాజధాని సాధించలేరా ?

రాజధాని నిధులు మోడీ మెడలు వంచి తీసుకు రాలేరా ?

మోడీకి ఎందుకు గులాం గిరి చేస్తున్నారు ?

విభజన హామీ ప్రకారం మన హక్కు అని మీకు తెలియదా ?

అప్పులు తెచ్చి జనాల నెత్తిన ఎందుకు పెడుతున్నారు ?

ఇప్పటికే రాష్ట్రం నెత్తిన 11 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి

ఇంకా అదనపు అప్పులు ఎందుకు పెడుతున్నారు ?

మోడీ కాలర్ పట్టుకొని రాజధాని కి నిధులు తీసుకు రండి

ఇవన్నీ మీరు మరిచి పోయి మళ్ళీ అరచేతిలో భ్రమలు చూపిస్తున్నారు ?

మొదట తీసుకున్న భూముల్లో ఇంతవరకు రాజధాని కట్టలేదు.

ఇప్పుడు మరో 40 వేల ఎకరాలు మళ్ళీ కావాల్సి వచ్చింది.

చంద్రబాబు గారు మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి అనుకుంటాన్నారా ?

2015 లోనే మూడేళ్లలో రాజధాని కడతాం అన్నారు.

ఇప్పుడు మళ్ళీ 3 ఏళ్లలో రాజధాని కడతాం అంటున్నారు

అప్పుడు ఇప్పుడు ఒకటే మాట

ముందు సేకరించిన 33 వేల ఎకరాల్లో రాజధాని కట్టండి.

ఆది పక్కన పెట్టీ… కొత్తగా 40 వేల ఎకరాలు ఎందుకు ?

బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టేందుకు భూములు సేకరిస్తున్నారా ? .

అమరావతికి అంత బిజినెస్ ఉందా ? బిజి..నెస్ ఉందా ?

ఒక్క అంతర్జాతీయ విమానం కూడా ఇప్పటికీ లేదు.

కేవలం విజయవాడకు ATR విమానాలే దిక్కు

గన్నవరం విస్తరణ అన్నారు..దానికి దిక్కులేదు

చంద్రబాబు కొద్దిగా భూమి మీద నడవాలి.

ఆలు లేదు..చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నారట..చంద్రబాబు తీరు

గన్నవరం విస్తరణ మీద ముందు దృష్టి పెట్టండి

రెండో దఫా 40 వేల కోట్ల భూ సేకరణకు కాంగ్రెస్ వ్యతిరేకం

మలి విడత భూములపై పెద్ద కుట్ర ఉంది

తొలి విడత రాజధాని కోసం..మలి విడత భూములు అమ్మాలని చూస్తున్నారు

ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తుంది

అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ఒకే..మనకు ఎందుకు సెల్ఫ్ ఫైనాన్స్ ?

రాజధాని కట్టాల్సిన బాధ్యత కేంద్రం ప్రభుత్వం ది.. మోడీ ది

వెంటనే మలి విడత భూ సేకరణ ఆపండి

తొలి విడత సేకరించిన 33 వేల ఎకరాల్లో రాజధాని కట్టండి

తొలి విడత భూములు ఇచ్చిన రైతులు ఇప్పటికీ సంతోషంగా లేరు

వారికి ఇప్పటి వరకు ఎటువంటి ప్రయోజనం దక్కలేదు

వారి త్యాగానికి ప్రతిఫలం అందలేదు.

మోడీ కాలర్ పట్టుకొని నిలదీయండి… లక్ష కోట్లు అయితే… లక్ష కోట్లు… 50 వేల కోట్లు అయితే..50 వేల కోట్లు… మోడీ నుంచి తేవాలి

చంద్రబాబు గారు మీరు రియల్ ఎస్టేట్ మాఫియా ను బంద్ చేయండి

రాజధాని మీద దృష్టి పెట్టండి

జగన్ 5 ఏళ్ల పాలన మన దురదృష్టం

మూడు రాజధానులు అని మూడు ముక్కలు ఆట ఆడారు

ఇప్పుడు రాజధాని కట్టే బాధ్యత మీపై ఉంది

ఇక్కడ విజన్ హౌజ్ చూశా..అందులో విజన్ లేదు.. విజన్ హౌజ్ లో పవర్ లేదు

మీ విజన్ కి పవర్ లేదు..

రాజధానికి ఎంత భూమి అవసరమో కాలం చెప్తుంది.

ముందే ఊహించి భూములు ఎందుకు సేకరిస్తున్నారు

ఇక్కడ రాజధాని కడితే నెక్స్ట్ ఏంటి అని తెలుస్తుంది.

మీరు సేకరించిన భూములతో ముంబయి కి ముంచిన రాజధాని అవుతుంది

రాజధాని పేరుతో దోపిడి జరుగుతుంది.

టెండర్ల పేరుతో అక్రమాలు జరుగుతున్నది.

హైదరాబాద్ బిజినెస్ ఎంత ?

ఇక్కడ బిజినెస్ ఎంత ?

ఇప్పటికీ విజయవాడ లో వచ్చేవి బొమ్మ ఫ్లైట్ ?

అందులో కాలు జరపడానికి కూడా వీల్లేదు.