భారత్ న్యూస్ విజయవాడ…మద్యం కేసు.. విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు
విజయవాడ:
ఏపీ మద్యం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది.
ఈ నెల 12న విచారణకు రావాలని ఆదేశించింది. ఉదయం 10 గంటలకు సిట్ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొంది.
ఇప్పటికే మద్యం కేసులో సిట్ అధికారులు విజయసాయిరెడ్డిని విచారించిన సంగతి తెలిసిందే.
