గ్రామ పంచాయతీ స్థలాలు ప్రైవేటు సంస్థకు కట్టబెట్టనున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం..?

…భారత్ న్యూస్ హైదరాబాద్….గ్రామ పంచాయతీ స్థలాలు ప్రైవేటు సంస్థకు కట్టబెట్టనున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం..?

కార్బన్ హక్కుల పేరిట పంచాయతీ స్థలాలను ఐఓఆర్ఏ అనే సంస్థకు 30 ఏళ్ల పాటు రాసిచ్చే కుట్ర?

తెలంగాణలోని గ్రామ పంచాయతీకి సంబంధించిన భూములను 30 ఏళ్ల పాటు ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించే కుట్ర చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం..

ఈ నేపధ్యంలో హరిత సౌభాగ్య అనే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఐఓఆర్ఏ ఎకొలాజికల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు అనుమతి ఇవ్వనున్న ప్రభుత్వం..

పంచాయతీల పరిధిలోని స్థలాల్లో హరిత వనాలు అభివృద్ధి చేసేందుకు 30 ఏళ్లు ప్రైవేటు కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చే విధంగా అన్ని గ్రామ పంచాయతీలు తీర్మానం చేసి పంపాలని ఆదేశాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం..

పాలకమండళ్లు అధికారంలో లేని సమయంలో, అధికారులతో ఈ కుట్రకు తెరలేపడం ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్న పంచాయతీ సభ్యులు..

30 ఏళ్ల పాటు ఒక ప్రైవేటు కంపెనీకి పంచాయతీ స్థలం కేటాయించడం దుర్మార్గమని, అలా చేస్తే పంచాయతీ భూములపై అధికారం కోల్పోతామని వాపోతున్న పంచాయతీ కార్యదర్శకులు..

ఒప్పంద పత్రాలు ప్రైవేటు కంపెనీ రూపొందించడం ఈ కుట్రలో ముఖ్యమైన అంశమని, ఒప్పంద పత్రాలు తమకు నచ్చిన విధంగా రూపొందించుకుంటారని ఆవేదనా వ్యక్తం చేస్తున్న పంచాయతీ సభ్యులు..

ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి తమను ఎవరూ బలవంత పెట్టలేదని, స్వచ్ఛందంగానే సంతకం చేస్తున్నామని సంతకం చేసే విధంగా ఒప్పంద పత్రాలను రూపొందించిన ప్రైవేటు కంపెనీ..

పంచాయతీ స్థలాలు ఎక్కడ ఉన్నాయి, ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి, వాటి సర్వే నంబర్లు ఏంటి, ఇలాంటి వివరాలన్నీ స్వచ్ఛందంగా తెలియజేశామని పంచాయతీ సభ్యులు సంతకం చేసే విధంగా ఒప్పంద పత్రాలు రూపొందించారని సమాచారం..

గ్రామ సభలో చర్చించేందుకు తగినంత సమయం ఇచ్చారని, ముందస్తు సమ్మతిని కూడా స్వచ్ఛందంగానే ఇస్తున్నామని గ్రామ సభలో పాల్గొన్న వారు సంతకం చేసే విధంగా పకడ్బందీగా ఒప్పంద పత్రాలు రూపొందించిన ప్రైవేటు కంపెనీ..

ఈ ప్రక్రియ పూర్తవుతే గ్రామ పంచాయతీ స్థలాలపై 30 ఏళ్ల పాటు అధికారం కోల్పోతామని ఆందోళన చెందుతున్న పంచాయతీ సభ్యులు..!!