అవినిగడ్డ డిఎస్పీ పై బెదిరింపు కాల్స్, మరి ఇప్పటివరకూ చర్యలు ఎందుకు లేవు ?

భారత్ న్యూస్ గుంటూరు..Ammiraju Udaya Shankar.sharma News Editor…అవినిగడ్డ డిఎస్పీ పై బెదిరింపు కాల్స్, మరి ఇప్పటివరకూ చర్యలు ఎందుకు లేవు ?

            వైసీపీ నేత గౌతమ్

అవనిగడ్డ సబ్ డివిజన్ పరిధికి చెందివారు కొందరు అవినిగడ్డ డిఎస్పీ పై అక్రమ రవాణాలను ఆపకూడదు వాటిని కొనసాగించాలి అంటూ వత్తిడి తెస్తూ, వారి విధులకు ఆటంకం కలిగించేలా బెదిరింపు ధోరణిలో ఆమెకు కాల్స్ వచ్చాయంటూ ఆమె కొన్ని రోజుల క్రితం అవనిగడ్డలో వారి కార్యాలం నందు జరిగిన ప్రెస్ మీట్‌లో వెల్లడించారు…,

ఒకవేళ నిజంగా ఆమెను ఎవరో బెదిరింపు ధోరణిలో ఫోన్ కాల్స్ లో బెదిరిస్తే, వెంటనే కేసు నమోదు చేయాల్సిన బాధ్యత ఆమెదేనని, కానీ ఆమె ఇప్పటివరకు ఎలాంటి కేసు ఎందుకు నమోదు చేయలేదని, ప్రెస్ మీట్‌లో ఫోన్ చేస్తున్న వాళ్ల పేర్లు, నంబర్లు ఎందుకు వెల్లడించలేదో అర్థం కావట్లేదని గౌతమ్ ఆర్చర్యం వ్యక్తం చేశారు..,

ఒక డీఎస్పీ లేదా ఇతర సీనియర్ అధికారి స్థాయి వారు వారి అధికారిక విధులకు ఆటoకం కలిగించేలా బెదిరింపులు వచ్చినప్పుడు వెంటనే సెక్షన్ 353 IPC / 124 BNSS క్రింద FIR నమోదు చేస్తారని అలా లేకుంటే కనీసం CSR అయినా నమోదు చేస్తారని, సూపీరియర్స్ కు తెలియచేసి, బెదిరింపు కాల్స్ యొక్క ఎవిడెన్స్ ను ప్రిజర్వు మరియు ట్రేస్ చేసి, మీడియా కు అడ్రస్ చేస్తారని, కానీ తమను బెదిరించారని ప్రెస్ మీట్ లో చెప్పి కేసు దాఖలు చేయకపోవటం
పేర్లు, వారి వివరాలు మరియు బెదిరింపు కాల్ యొక్క సoబంధిత వివరాలను వెల్లడించకపోవటం అనేది వారి ప్రకటన యొక్క నిజాయితీ మరియు పారదర్శకత గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుందని, ప్రజా సేవకులుగా వారు చట్ట పాలనను నిలబెట్టాలని, వాటిని నిశ్శబ్దం చేయకూడదని గౌతమ్ తెలిపారు.