భారత్ న్యూస్ గుంటూరు…..పేదరిక నిర్మూలనే ప్రభుత్వ ధ్యేయం
రాష్ట్రంలో పేదరికం నిర్మూలనే చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ధ్యేయమని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నేత బొబ్బా గోవర్ధన్ లు అన్నారు. మండల పరిధిలోని పులిగడ్డలో సుపరిపాలనలో తొలి అడుగు- ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కనపర్తి శ్రీనివాసరావు, బొబ్బా గోవర్ధన్ లు మాట్లాడుతూ దార్శనికుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పేదరికం నిర్మూలన కోసం పీ 4 కార్యక్రమానికి రూపకల్పన చేశారని, ఇందులో భాగంగా నియోజకవర్గాల వారీగా పేదలను గుర్తించి వారి జీవితాల్లో మార్పు తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. జగన్ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం అయినప్పటికీ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుచుకుంటూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతూ మంచి ప్రభుత్వంగా ప్రజల మన్ననలు పొందుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ఇంటింటికి తిరుగుతూ వివరించారు.. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్రా సుధాకర్ రావి రత్నగిరి, మండలి రామ్మోహన్ రావు, బండే రాఘవ, మేడికొండ విజయ్, గుంటూరు వినయ్, డోకిపర్తి బాల కోటేశ్వరరావు,చందన రంగారావు,నాగిడి రాంబాబు, బళ్ల ప్రసాద్, నాగిడి శివ నాగేశ్వరరావు, నాగిడి వెంకటేశ్వరరావు,కొక్కిలిగడ్డ నాగ బాబు,చెన్ను బాబురావు,చెన్ను ఆంజనేయులు,నాగిడి రాజు తదితరులు పాల్గొన్నారు
