ఉత్తర భారతదేశంలో పలు చోట్ల భూప్రకంపనలు

భారత్ న్యూస్ ఢిల్లీ…..Earthquake Shakes Delhi: ఉత్తర భారతదేశంలో పలు చోట్ల భూప్రకంపనలు
పౌర్ణమి రోజున ఇలా భూకంపం సంభవించింది
Earthquake Shakes Delhi: ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో భూమి కంపించింది. భూకంపం తీవ్రత రెక్టార్ స్కేల్‌పై 4.1గా నమోదు అయింది. భూమి ఒక్కసారిగా కంపించటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.దేశ రాజధాని ఢిల్లీలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. గురువారం ఉదయం ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో భూమి కంపించింది. భూకంపం తీవ్రత రెక్టార్ స్కేల్‌పై 4.1గా నమోదు అయింది. భూమి ఒక్కసారిగా కంపించటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ఢిల్లీతో పాటు ఉత్తర భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో స్వల్పంగా భూమి కంపించింది.ఎన్‌సీఆర్‌లో భారీ వర్షం..

భూకంపం రావటానికి కొన్ని గంటల ముందు ఎన్‌సీఆర్‌లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. పలు రోడ్లు నదులను తలపించాయి. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. రోడ్డుపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఇక, మెట్రో స్టేషన్లు, పిల్లర్ల మీద నుంచి నీరు జలపాతంలాగా కిందకు పడింది. కొన్ని చోట్ల రోడ్డుపై నిలిపిన వాహనాలు నీటిలో టైర్ల వరకు మునిగిపోయాయి. ఓ రోడ్డుపై మోకాలి వరకు నీళ్లు రావటంతో బైకర్లు చాలా ఇబ్బందిపడ్డారు.