…భారత్ న్యూస్ హైదరాబాద్….కూలిన బ్రిడ్జి.. నదిలో పడిపోయిన వాహనాలు
గుజరాత్ వడోదరాలోని మహిసాగన్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జి ఒక్కసారిగా కూలింది.
రెండు లారీలతో పాటు పలు వాహనాలు నదిలో పడిపోయాయి.
విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముగ్గురిని కాపాడగా..
నలుగురు మృతి చెందారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ప్రమాదంలో మరణాల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది.
మరోవైపు అధికారులు వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. ఇతర మార్గాల ద్వారా వాహనాలను మళ్లిస్తున్నారు…
