..భారత్ న్యూస్ హైదరాబాద్….భార్య వ్యభిచార అనుమానంతో బిడ్డకు డీఎన్ఏ టెస్ట్ చేయలేమంటూ బాంబే హైకోర్టు కీలక తీర్పు
ముంబైలో ఓ వ్యక్తి తన భార్య వ్యభిచారం ఆరోపణలపై విడాకులు కోరాడు.. 2011లో వివాహం చేసుకున్న ఈ దంపతులు, 2013 నుంచి వేరుగా ఉంటున్నారు
ఆ సమయంలో మహిళ మూడు నెలల గర్భవతి.. బిడ్డ తనకు పుట్టలేదని భర్త ఆరోపణలు చేయగా, 2020లో బిడ్డకు డీఎన్ఏ పరీక్ష చేయాలని ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది

ఈ ఉత్తర్వులు హైకోర్టులో సవాల్ చేయగా.. బాలుడి హక్కులకు తాము ప్రాధాన్యత ఇస్తామని హైకోర్టు తెలిపింది
వ్యభిచార ఆరోపణలు నిరూపించడానికి ఇతర ఆధారాలను ఉపయోగించవచ్చు తప్పా, బాలుడికి డీఎన్ఏ పరీక్షలు చేయాల్సిన అవసరం లేదు
మైనర్ పిల్లవాడు తల్లిదండ్రుల మధ్య గొడవల్లో ఒక సాధనంగా మారకూడదు.. చిన్న వయసులో బలవంతంగా రక్త పరీక్ష చేయడం న్యాయసమ్మతం కాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, బాంబే హైకోర్టు తేల్చిచెప్పింది