కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం

భారత్ న్యూస్ విజయవాడ…కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం – అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా కమిటీ

కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిపై నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వెంటనే అతడిని అరెస్టు చేయాలని అవనిగడ్డ నియోజకవర్గ తెలుగు మహిళా కమిటీ డిమాండ్ చేసింది. బుధవారం అవనిగడ్డ లోని నియోజకవర్గ తెలుగుదేశం కార్యాలయంలో నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు బండే నాగ వెంకట కనకదుర్గ అధ్యక్షతన ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ప్రజాసేవకు అంకితమైన నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేయడం ఒక బాధ్యతారాహిత్య చర్యఅని ప్రజాస్వామ్య విలువలపై దాడి అని మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే ఇలాంటి వారిని క్షమించరాదని అన్నారు.
వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు తన రాజకీయ జీవితమంతా ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తూ, పారదర్శకత మరియు నైతికతకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా సేవలందిస్తున్నారని అలాంటి నాయకురాలి పై అసత్య ప్రచారాలు చేయడం కేవలం రాజకీయ స్వార్థానికి పాల్పడే వారు చేసే పనిగా మేము భావిస్తున్నామని ఈ విషయంలో ప్రసన్న రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, ప్రజల సమక్షంలో క్షమాపణ చెప్పాలని తెలుగు మహిళలు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు మహిళా కమిటీ అధ్యక్షురాలు బండే నాగ వెంకట కనకదుర్గ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ దుర్గ గుడి బోర్డు సభ్యురాలు విశ్వనాథపల్లి పాప,అన్నపరెడ్డి వెంకటేశ్వరమ్మ,ఆకుల సీతా మహాలక్ష్మి,అన్నపూర్ణమ్మ, శాంతి తదితరులు పాల్గొన్నారు.