ఏపీ కేబినెట్ సమావేశం నిర్ణయాలు

భారత్ న్యూస్ గుంటూరు…..Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీ కేబినెట్ సమావేశం నిర్ణయాలు

ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.

“హడ్కో నుంచి తీసుకున్న రుణాలకు గ్యారంటీ ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

తోట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇవ్వాలనే ప్రతిపాదనకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది.

అమరావతిలో వరల్డ్ ఎకానమీ ఫోరం నిర్మాణ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది.

కుళాయి నీరు అందించేందుకు రూ.10వేల కోట్ల రుణాల సమీకరణకు క్యాబినెట్ అనుమతి ఇచ్చింది.

అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటు ద్వారా రూ.4వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా.

నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కుకు అదనంగా 790 ఎకరాల స్థల సేకరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

ఏపీ స్పేస్ పాలసీ 2025-30కి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

గత ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ ను దారుణంగా పెంచింది. దాన్ని రూ.3వేల వరకు తగ్గింపు.