భారత్ న్యూస్ విజయవాడ…పోలీసు స్టేషన్లలో సీసీ కెమెరాలు – సందేహం వ్యక్తంచేసిన హైకోర్టు
రాష్ట్రంలోని పోలీసు స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామంటూ డీఎస్‌పీలు నివేదికలు – అవి అన్నీ ఒకే విధానంలో ఉండటంపై హైకోర్టు సందేహం
అమరావతి

రాష్ట్రంలోని పోలీసు స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ఠాణాతోపాటు ప్రాంగణం మొత్తం కనిపిస్తుందని ధ్రువీకరిస్తూ డీఎస్‌పీలు నివేదికలు ఇవ్వడం, అవి అన్నీ ఒకే విధానంలో ఉండటంపై హైకోర్టు సందేహం వ్యక్తంచేసింది. కొన్ని జిల్లాలకు సంబంధించిన నివేదికల్లో నోడల్ అధికారుల సంతకాలు లేవని, వారి తరఫున ఇతరులు సంతకం చేశారని ఆక్షేపించింది. డీఎస్‌పీలు సమర్పించిన నివేదికల వాస్తవికతను తేల్చేందుకు ‘అడ్వొకేట్ కమిటి’ని ఏర్పాటు చేస్తామని, కొన్ని ఠాణాల్లో పరిశీలించి నిబంధనల మేరకు సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారా? లేదా? అనే వ్యవహారంపై నివేదిక కోరతామని వ్యాఖ్యానించింది.
ఓ హెబియస్ కార్పస్ పిటిషన్‌లో విజయవాడ మూడో అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ నివేదిక ఇచ్చారని, దాని ప్రకారం విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లో ఒక కెమెరా మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారని గుర్తుచేసింది. అందుకు భిన్నంగా విజయవాడ అసిస్టెంట్ పోలీసు కమిషనర్