భారత్ న్యూస్ ఢిల్లీ…..యాపిల్ కీలక మార్పులు: సీఓవోగా సబిహ్ ఖాన్, డిజైన్ బృందం టిమ్‌కుక్ ఆధీనంలోకి
టెక్ దిగ్గజం యాపిల్ కీలక నాయకత్వ మార్పులు చేసింది.
కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ విలియమ్స్ పదవీ విరమణకు సిద్ధమవుతున్న నేపథ్యంలో…
భారతీయ మూలాలున్న సబిహ్ ఖాన్ కొత్తగా సీఓవోగా నియమితులయ్యారు.
ఇకపై యాపిల్ డిజైన్ బృందం నేరుగా సీఈవో టిమ్‌కుక్‌కు నివేదించనుంది.
గత రెండు దశాబ్దాలుగా యాపిల్ లీడర్షిప్ టీంలో ఉన్న సబిహ్ ఖాన్.. ఆపరేషన్స్ విభాగంలో కీలక పాత్ర పోషించారు.
