భారత్ న్యూస్ విశాఖపట్నం..పేదల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ధ్యేయం – బొబ్బా గోవర్ధన్
పేదల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ధ్యేయమని సీనియర్ తెలుగుదేశం నేత బొబ్బా గోవర్ధన్ అన్నారు. బుధవారం అవనిగడ్డ శివారు సీతాయలంక ప్రాంతంలో సుపరిపాలనలో తొలి అడుగు- ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం జరుగగా ఈ కార్యక్రమంలో బొబ్బా గోవర్ధన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి వివరించారు. రేపటి తరం భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేక పోయినా సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో సంపద సృష్టించి ఆ ఫలాలను ప్రజలకు అందిస్తూ ముందుకు సాగుతున్నారని, ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రానికి ముందెన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధికి చిరునామాగా మారుస్తున్నారన్నారు. ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం మండల ఇంచార్జి కర్రా సుధాకర్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, ఈ కార్యక్రమంలో బండే రాఘవ, పర్చూరి దుర్గాప్రసాద్,కంచర్ల ఆనంద్,మేడికొండ విజయ్, ఘంటశాల రాజమోహన రావు,కొల్లూరి వాసు,కమ్మిలి సుబ్రమణ్యం, మేడికొండ సురేష్, దోవారి ప్రసాద్,తూమాటి మల్లి, కర్రా యేసుబాబు, గుంటూరు చంటి, దిడ్ల ప్రభుదాస్, నీల మనోహర్,బండ్రెడ్డి సురేష్,గుంటూరు మోహనరావు, గుంటూరు లక్ష్మణ రావు,కర్రా ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు
