ఓటమి ఎరుగని మహా నాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి

భారత్ న్యూస్ రాజమండ్రి….ఓటమి ఎరుగని మహా నాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి

వైయస్ఆర్ కలలు కన్న సమాజ నిర్మాణం కోసం కలిసికట్టుగా పోరాడదాం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ యువ నాయకులు సింహాద్రి వికాస్ బాబు

చల్లపల్లిలో ఘనంగా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

అధిక సంఖ్యలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

చల్లపల్లి:
తన 31 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఆరుసార్లు అసెంబ్లీకి, నాలుగు సార్లు లోక్సభకు పోటీ చేసి గెలుపొందిన ఓటమి లేని మహా నాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ యువ నాయకులు సింహాద్రి వికాస్ బాబు కొనియాడారు. దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు చల్లపల్లిలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. చల్లపల్లి- మచిలీపట్నం రహదారిలోని రిజిస్టర్ ఆఫీసు వద్ద ఉన్న వైయస్సార్ విగ్రహానికి సింహాద్రి వికాస్ బాబు స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జోహార్ వైయస్సార్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సింహాద్రి వికాస్ బాబు మాట్లాడుతూ దివంగత మహా నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఆయన కలలు కన్న సమాజ నిర్మాణం కోసం కలిసికట్టుగా పోరాటం చేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల మూడు నెలలే పనిచేసినప్పటికీ ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్మెంట్, పావలా వడ్డీకి రుణాలు, జలయజ్ఞంతో ప్రాజెక్టుల నిర్మాణం వంటి శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయే పథకాలు ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచి వైయస్సార్ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ప్రతి ఒక్కరిని పేరుపేరునా ఆప్యాయంగా పలకరిస్తూ అందరిలో ఉత్సాహాన్ని నింపారు. పలువురు యువకులు వికాస్ బాబుతో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహపడ్డారు. అందరితో ఓపిగ్గా ఫోటోలు దిగుతూ వారిలో ఉత్సాహాన్ని నింపారు.
కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు చింతలమడ నాని, నాయకులు మోపిదేవి ద్వారకానాథ్, మతి రాంబాబు, వెనిగళ్ళ తారక జగదీష్, నడకుదురు సర్పంచ్ గొరిపర్తి సురేష్, జుజ్జువరపు భాగ్య రావు, మైనార్టీ సెల్ నాయకులు అర్షద్, పాగోలు నాగ సీతారామరావు(ఫణి), ఆది రాంబాబు, కొమ్ము డేవిడ్, చండ్ర చిన్ని, బెల్లపు హరిబాబు, మోదుమూడి కుటుంబరావు, బొందలపాటి లక్ష్మి, మద్దాల వీరాస్వామి, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఘనంగా నివాళులు అర్పించారు నివాళులు అర్పించారు.