భారత్ న్యూస్ విశాఖపట్నం..బ్రేకింగ్ న్యూస్
కృష్ణాజిల్లా
అవనిగడ్డ నియోజకవర్గం
అవనిగడ్డ సబ్ డివిజన్ పరిధిలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవు: అవనిగడ్డ డి.ఎస్.పి విద్యశ్రీ
అవనిగడ్డ సబ్ డివిజన్ పరిధిలో ఇసుక, బుసక, మట్టి లాంటివి అక్రమ రవాణా చేస్తే వారిపై చట్ట రిత్యా చర్యలు తీసుకుంటామని అవనిగడ్డ డిఎస్పి విద్య శ్రీ అన్నారు.

వాటితోపాటు రేషన్ బియ్యం, మద్యం అక్రమ రవాణా, జూదం, గ్రామాలలో బెల్ట్ షాపులు లాంటివి నిర్వహించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.
కొంతమంది వ్యక్తులు అసాంఘిక కార్యక్రమాలకు అండగా ఉంటూ పోలీసువారి విధులకు ఆటంకం కలిగిస్తున్నారని అలాంటి వారిని ఉపేక్షించేది లేదని అన్నారు.
అవనిగడ్డ సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న 9440796406 ఈ నెంబర్కు ఫోన్ చేసి వివరాలు తెలియజేయవచ్చని అన్నారు.
సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అన్నారు.