భారత్ న్యూస్ శ్రీకాకుళం…విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రానున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు
- స్వయంగా ఏర్పాట్లను పరిశీలిస్తున్న రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ
- వీఆర్ హైస్కూల్లో సిబ్బందికి అధికారులకు పలు సూచనలు
- అనిల్ గార్డెన్స్ లో లోకేష్ బాబు బస ఏర్పాట్లు, కార్యకర్తలతో సమీక్ష ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ

నెల్లూరులో అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్దమైన వీఆర్ హైస్కూల్ ప్రారంభోత్సవానికి విద్యాశాఖామంత్రి నారా లోకేష్ రానున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు. ఈ క్రమంలో వీఆర్ హైస్కూల్లో విద్యాశాఖ మంత్రి రాకకు సంబంధించి ఏర్పాట్లను కూతురు షరణి తో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. అధికారులతో సమీక్ష నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాక సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు. పొరపాట్లు జరక్కుండా చూడాలని అధికారులకు సూచించారు. విద్యార్థులు, తల్లితండ్రులతో మంత్రి లోకేష్ బాబు ఇంటరాక్ట్ కానున్న నేపథ్యంలో స్కూల్ సిబ్బందికి పలు అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం అనీల్ గార్డెన్ లో లోకేష్ బాబు బస ఏర్పాట్లు, కార్యకర్తల సమావేశం ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్ ,కార్పొరేషన్ కమీషనర్ నందన్ ,టౌన్ డీఎస్పీ సింధు ప్రియ ,డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ,ప్రిన్సిపాల్ వెంకట్రావ్ ,ఎంఈఓ తిరుపాల్ తదితరులు పాల్గొన్నారు .